అలా You Can Win పుస్తకంతో నా పుస్తక ప్రయాణం మొదలయింది. అదే ఊపులో యండమూరి (అప్పటికి నాకు తెలిసిన రచయిత ఈయన ఒక్కడే)  నవలలు చాలా చదివాను. వాటిలో కొన్ని తులసిదళం ,  డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు , రాక్షశుడు_,_ ఇంకా కొన్ని పుస్తకాలు వేరే రచయితలవి కూడా  చదివాను. కాని ఇప్పుడు ఆ పుస్తకాల పేర్లు అంతగా గుర్తు లేవు. మేర్లపాక మురళి రచయితవి కొన్ని నవలలు స్వాతి వార పత్రిక లో చదివినట్లు గుర్తు. ఆ తరువాత ఆర్ధిక పరిస్థితి అంతగా సహరించక  కొన్నాళ్ళు పుస్తక ప్రయాణానికి విరామం ప్రకటించక తప్ప లేదు. ఇక ఎలాగోలా డిగ్రీ పూర్తి చేసుకొని MCA చదవటానికి బెంగుళూరు లో వచ్చి పడ్డాను. MCA మొదటి రెండు సంవత్సరాలు ఆ కంప్యూటర్ పుస్తకాలతోనే సరిపోయింది.
              కానీ చివరి సంవత్సరంలో కొన్ని బయటి పుస్తకాలు కూడా చదివే అవకాశం వచ్చింది. ఆ  పుస్తకాలలో ఒకటి ఇడ్లి-వడ-ఆకాశం, ఇంకా మిగతా రెండు ఇంగ్లీష్వి  The Last Lecture (ఇదే నా మొట్టమొదటి ఇంగ్లీష్ పుస్తకం ) and My Experiments With The Truth_._మూడు పుస్తకాలు కూడా నాకు బాగా నచ్చాయి. నన్ను ఇవి ఎంతో కొంత ప్రబావితం కూడా చేసాయి. ఈ మూడు పుస్తకాలు వేరే వాళ్ళ దగ్గిర అరువు తెచ్చుకొని చదివినవే. ఇక అక్కడితో MCA పూర్తి అయింది.

Symphony లో Internship చేసే రోజుల్లో The Beyond Secret పుస్తకం కొనుక్కొని మరీ చదివాను. ఉద్యోగం ఎప్పుడు వస్తుందా , జీతంతో పుస్తకాలు ఎప్పుడు కొనుక్కొని చదువుదామా అన్నట్లుగా వుండేవాడ్ని. ఇక మన MCA పాండిత్యం అంతా ఉపయోగించి ఎలాగోలా ఉద్యోగం సంపాదించేసాను. ఇక పుస్తకాలు కొనటానికి చేతిలో డబ్బులు ఎప్పుడు ఉండేవి. ఇక ఇంగ్లీష్ పుస్తకాలు ఎక్కడ తక్కువ దొరుకుతాయ అని వెతుకుతూ వుండేవాడ్ని. కొన్ని రోజులకి Online Shopping గురుంచి తెలిసింది. ఏదో సెమినార్కి వెళ్తే అక్కడ Stay Hungry Stay Foolish మరియు Connect The Dots పుస్తకాల గురుంచి తెలిసింది. ఇక ఆ రెండు పుస్తకాలు Flipkart.com లో కొన్నాను. పుస్తకాలు మంచి కండిషన్ లోనే వచ్చాయి. ఇక Online Shopping మీద నమ్మకం కుదిరింది. ఇక అప్పట్నుంచి అన్ని ఇంగ్లీష్ పుస్తకాలు ఏ వెబ్సైటు లో తక్కువ ఐతే అందులోనే  కొంటున్నాను. సమస్య అంతా తెలుగు పుస్తకాల గురుంచే, ఈ బెంగుళూరు లో తెలుగు పుస్తకాలు దొరకవు.ఇక ఇంటికి వెళ్ళిన ప్రతి సారి (గుంటూరు లోనో లేక విజయవాడ లోనో)  ఒకే సారి ఎక్కువ పుస్తకాలు కొనుకోస్తున్నాను. కాని మనం ఊరికి వెళ్ళటమే తక్కువ.

ఇక అలా నా పుస్తక ప్రయాణం నిర్విరామంగా సాగుతూనే వుంది. ఇక్కడ ముఖ్యంగా ఇద్హరి గురుంచి చెప్పుకోవాలి.
ఒకరు మా MCA లెక్చరర్ Jaini.C.P , వారే నాకు ఎన్నో మంచి ఇంగ్లీష్ పుస్తకాలు గురుంచి తెలియ చేసారు, ఇప్పటికి తెలియజేస్తూనే వున్నారు.ఇక రెండో వారు మా పాత రూంమేట్ రాజేష్ దేవభక్తుని అన్న, ఈయన ఎప్పటికప్పుడు తెలుగు లో మంచి పుస్తకాల గురుంచి చెప్తూ వుంటాడు. మంచి మంచి పుస్తకాల గురుంచి సలహాలు ఇస్తూ వుంటాడు.ఇద్హరికి సర్వదా కృతజ్ఞుడ్ని.

ఇప్పటి వరకు నేను చదివిన పుస్తకాలను బట్టి ,తెలుగులో నాకు నచ్చిన రచయితలు కొమ్మూరి వేణుగోపాలరావు , యండమూరి, బుచ్చిబాబు, మరియు మల్లాది గార్లు, అలాగే నచ్చిన పుస్తకాలలో కొన్ని  అంతర్ముఖం,  చివరకు మిగిలేది, కాలాతీత వ్యక్తులు , పెంకుటిల్లు , మదుపం, మరియు  ఏడు తరాలు. ఇంగ్లీష్ రచయితలలో P****aulo coelho, Robin Sharma, Randy Paush,  మరియు  Rhonda Byrne... అలాగే నచ్చిన  పుస్తకాలు The Last Lecture , The Secret, How to get whatever you want, Leader who had no title, Eleven Minutes, I too had a love story, Tuesdays with moorie, మరియు Who Moved my cheese ....ఇంకా చాల పుస్తకాలు వున్నాయి.

                                                                                                                          సమాప్తం. :)